• Home » Telangana » Assembly Elections » Adilabad

ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇది ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఆదిలాబాద్, జైనద్, బేలా మండలాలున్నాయి. 1952లో ఆదిలాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ లక్షా 86 వేల 348 మంది ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచీ ఇక్కడ రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి కూడా ఆయనకే టికెట్ లభించింది. మరోసారి విక్టరీ సాధించింది హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. జోగు రామన్న 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2012లో వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విక్టరీ సాధించారు. అటు తర్వాత 2014, 2018లో కూడా వరుసగా ఆయనే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని ఎన్నికల బరిలోకి దిగారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. 2018లో ఇలా.. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. ఈయనకు 74,050 ఓట్లు పోలయ్యాయి. 44.66 శాతం ఓట్ షేర్ వచ్చింది. బీజేపీ నుంచి పోటీ చేసిన పాయల్ శంశర్‌కు 47, 444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు 32, 200 ఓట్లు రాగా.. రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి నారాయణకు 4,125 ఓట్లు, బీఎస్సీ అభ్యర్థి ఈర్ల సత్యనారాయణకు 1,352 ఓట్లు, నోటాకు 1149 ఓట్లు వచ్చాయి. 2014లో ఇలా.. 2014లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న గెలుపొందారు. 58, 705 ఓట్లు రాగా.. 40.92 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కు 43, 994 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్ దేశ్‌పాండే‌కు 30, 298 ఓట్లు రాగా.. నోటాకు 864 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంగా ఏర్పడిన 1952లో దాజీ శంకర్ రావు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 1962లో విట్టల్ రావ్ దేశ్ పాండే.. ఇండిపెండెంట్‌‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1967లో కస్తాల రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి, 1972లో మసూద్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ నుంచి, 1978లో చిలుకూరి రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్‌‌గా, 1983లో చిలుకూరి వామన్ రెడ్డి ఇండిపెండెంట్‌‌గా గెలుపొందారు. ఇక 1985లో చిలుకూరి రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్‌‌గా, 1989లో చిలుకూరి రామచంద్రారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అనంతరం 1994లో చిలుకూరి వామన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి విక్టరీ సాధించారు. 1999లో పడాల భూమన్న.. ఇండిపెండెంట్‌‌గా పోటీ చేసి గెలుపొందారు. 2004లో మళ్లీ చిలుకూరి రామచంద్రారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విక్టరీ సాధించారు. ఇక 2009లో జోగు రామన్న టీడీపీ నుంచి విజయం సాధించారు. 2012లో వచ్చిన బైపోల్స్‌లో బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న విజయం సాధించగా.. అటు తర్వాత వచ్చిన 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

ఆదిలాబాద్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి