హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డిపై గెలుపోందారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఈ శాసనసభ స్థానాన్ని 1972 వరకూ గగన్‌మహల్ పేరుతో పిలిచేవారు. ఆ తరువాత కొంతకాలం పాటు హిమాయత్‌నగర్‌గా కొనసాగిన ఈ నియోజకవర్గం 2009 నాటి నియోజకవర్గ పునర్విభజనలో అంబర్‌పేట్‌గా మారింది. నగరంలోని అంబర్‌పేట్, తిలక్‌నగర్, గోల్‌నాక, బర్కత్‌పురా, శివమ్ రోడ్‌తో పాటూ కాచిగూడ, నల్లకుంట, బాగ్‌లింగంపల్లి, విద్యానగర్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,969గా ఉంది. 2018లో ఎవరి మధ్య? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ తరుపున సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి 81,430 ఓట్లతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన ఈ ఎన్నికల్లో తన సీటు నిలబెట్టుకున్నారు. అప్పటి టీఆర్ఎస్‌కు చెందిన తన సమీప ప్రత్యర్థి ఎ.సుధాకర్ రెడ్డిపై 62,598 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే, 2018 నాటి ఎన్నికల్లో ఈ సీటును టీఆర్ఎస్ తరపున కాలేరు వెంకటేశ్ కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డిపై 1,016 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |