సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో ఆందోల్ నియోజకవర్గం ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,23,352గా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, రాయ్‌కోడ్, మున్‌పల్లె, పుల్కల్.. మెదక్ జిల్లాలోని ఆల్లదుర్గ, రేగోడే, టెక్మల్ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2018లో ప్రధానంగా టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన క్రాంతి కిరణ్ చంటి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ మధ్య ప్రధాన పోటీ జరిగింది. మొత్తం 89.27 శాతం పోలింగ్ నమోదవ్వగా క్రాంతి కిరణ్‌కు 104,229 ఓట్లు, దమోదర రాజనర్సింహకు 87,764 ఓట్లు, ఇక బీజేపీ తరపున రేసులో ఉన్న బాబూ మోహన్‌కు 2,404 ఓట్లుపడ్డాయి. 2014లో జరిగిన పోటీ విషయానికి వస్తే.. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన బాబూ మోహన్ గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దామోదర రాజనర్సింహకు 84,796 ఓట్లుపడ్డాయి. బుర్రి ఎల్లయ్యకు 3276 ఓట్లుపడ్డాయి. మొత్తంగా బాబూ మోహన్ 3,291 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |