కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ ఒకటి. ఇది ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో ఉంది. ఇందులో కెరమెరి, వాంక్డీ, జైనూర్, నర్నూర్, తిర్యాణీ, రెబ్బెనా, అసిఫాబాద్, సిర్పూర్, లింగాపూర్, గాధిగూడ మండలాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పురుష ఓటర్లు 1,07,128 ఉండగా, మహిళా ఓటర్లు 1,06,846 మంది ఉన్నారు. ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి.. తరువాత పార్టీ మారారు. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో గాంగ్వీ కాశీరాం(కాంగ్రెస్), కొండా లక్ష్మణ్ బాపూజీ(కాంగ్రెస్), 1957లో నారాయణ రెడ్డి(కాంగ్రెస్), 1962, 1967, 1972లలో కె.భీమ్ రావు(కాంగ్రెస్), 1978లో నర్సయ్య(కాంగ్రెస్), 1983, 1985లలో మహేష్(సీపీఐ), 1989లో నర్సయ్య(కాంగ్రెస్),1994లో మల్లేష్(సీపీఐ), 1999లో డా.సుభద్ర(టీడీపీ), 2004లో శ్రీదేవి(టీడీపీ), 2009లో ఆత్రం సక్కు(కాంగ్రెస్), 2014లో లక్ష్మీ(టీఆర్ఎస్), 2018లో ఆత్రం సక్కు(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. 2018లో... 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కుకి 65,788 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి బరిలో దిగిన ఆత్మరావుకి 6,711 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కి పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్ కు 40.92 శాతం, టీఆర్ఎస్ 40.81 శాతం, బీజేపీకి 4.17 శాతం ఓట్లు వచ్చాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉండింది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు కొన్నాళ్లకు బీఆర్ఎస్ లో చేరారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |