హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో బహదూర్‌పుర ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో అల్లాబాద్, జహనుమ, తాద్ బన్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, దూత్‌బౌలి, హషామాబాద్ ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 2,59,214 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,33,842 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,25,324 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ మొజం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎంకు చెందిన మహ్మద్ మొజం ఖాన్.. తన సమీప ప్రత్యర్థి మీర్ అహ్మద్ అలీ (సీపీఐ) పై 56,194 ఓట్ల ఆధిత్యతతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున సిటింగ్ ఎమ్మెల్యే అయిన మహ్మద్ మొజం ఖాన్.. తన సమీప ప్రత్యర్థి అబ్దుల్ రహమాన్ (టీడీపీ) పై 95,045 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొజం ఖాన్‌కు 1,06,874 ఓట్లు రాగా.. రహమాన్‌కు 11,829 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి చెందిన మొజంఖాన్.. తన సమీప ప్రత్యర్థి మీర్ ఇనాయతి అలి బక్రి (బీఆర్ఎస్) పై 82,518 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొజంఖాన్‌కు 96,993 ఓట్లు రాగా, అలి బక్రికి 14,475 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |