నిజామాబాద్ జిల్లాలోని బాల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఈ నియోజకవర్గంలో మొత్తం 1,77,673 మంది వోటర్లు ఉన్నారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, కమర్‌పల్లి, మెండోర, వెల్పూర్, ఎరగట్ల, భీమగల్, ముప్కల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీకి చెందిన కే.అనంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి విజయం సాధించారు. 1962, 67,72లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గడ్డం రాజారామ్ ఎన్నికయ్యారు. 1981తో కాంగ్రెస్‌కు చెందిన గడ్డమ్ ఎస్.బాయి గెలుపొందగా. 1983,85లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున జీ.మధుసూదన్ రెడ్డి గెలిచారు. 1989 నుంచి 2004 మధ్య వరుసగా జరిగిన నాలుగు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కే.ఆర్.సురేశ్ రెడ్డి విజయం సాధించారు. 2009 నాటి ఎన్నికల్లో పీఆర్పీ తరపున ఇ.అనిల్ కుమార్ గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి రెండు(2014,18) సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేముల ప్రశాంత రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నాటి ఎన్నికల్లో ప్రశాంత రెడ్డి బీఎస్పీకి చెందిన తన సమీప ప్రత్యర్థి సునీక్ కుమార్ ముత్యాలపై 32,408 వోట్లతో గెలుపొందారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన తన సమీప ప్రత్యర్థి ఇ. అనిల్‌కుమార్‌పై 36,248 వోట్ల మెజారిటీతో గెలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |