బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఒకటి. ఇది పెద్దపల్లి లోకసభ పరిధిలోకి వస్తుంది. టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,53,016 కాగా.. అందులో పురుషులు 77,207, మహిళలు 75,795 మంది ఉన్నారు. ఇందులో బెల్లంపల్లి, భీమిని, కాసిపేట, నెన్నల్, వేమనపల్లె, తాండూర్, కన్నెపల్లె మండలాలున్నాయి. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గుండా మహేష్(సీపీఐ) ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో సైతం ఆయనే మళ్లీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దుర్గం చెన్నయ్య, కాంగ్రెస్ నుంచి గడ్డం వినోద్, బీజేపీ నుంచి శ్రీదేవీ బరిలో నిలుస్తున్నారు. 2018 ఎన్నికల్లో.. టీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య 2018 ఎన్నికల్లో 55,026 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ 43,750 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ 10,684 ఓట్లు పొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 43.16 శాతం, కాంగ్రెస్ కు 34.31 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి అప్పుడు నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |