Home » Telangana » Assembly Elections » Boath
ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. తాంసీ, తలమడుగు, గుడిహథ్నూర్, ఇచ్చోడ, బజార్ హథ్నూర్, బోథ్, నేరెడిగొండ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 1962లో బోథ్ నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి అసెంబ్లీ అభ్యర్థిగా సి.మాధవరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వరుసగా 1983 వరకూ హస్తం పార్టీనే విజయం సాధించింది. 1967, 1972లో ఎస్.ఏ.దేవ్‌శా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1978లో అమర్ సింగ్ కిల్వత్, 1983లో ఎం.కాశీరాం కాంగ్రెస్ నుంచి విక్టరీ సాధించారు. ఇక 1985, 1989 జి.రామారావు తెలుగు దేశం పార్టీ నుంచి విజయం సాధించారు. 1994, 1999లో గోదాం నగేశ్ టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక 2004లో సోయం బాపూరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విక్టరీ సాధించారు. 2009లో గోదాం నగేశ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018లో రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023లో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. 2004లో.. 2004లో బీఆర్ఎస్ అభ్యర్థి సోయం బాపురావు బోథ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 53940 ఓట్లు వచ్చాయి. జి.నాగేశ్ టీడీపీ నుంచి పోటీ చేసి 41569 ఓట్లు సంపాదించారు. మాధవిరాజు జనతా పార్టీ నుంచి పోటీ చేసి 3491 ఓట్లు సంపాదించారు. 2009లో.. 2009లో టీడీపీ నుంచి బోథ్ నుంచి పోటీ చేసిన గోదాం నాగేశ్ గెలుపొందారు. 64895 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనిల్ జాదవ్‌కు 33900 ఓట్లు పోలయ్యాయి. 2014లో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రాథోడ్ బాపురావు విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌పై 26993 ఓట్ల తేడాతో బాపురావు విక్టరీ సాధించారు. 2018లో.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. 9 నెలల ముందుగానే మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బోథ్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రాథోడ్ బాపు రావు విజయం సాధించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |