చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇది పెద్దపల్లి లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇందులో చెన్నూరు, మందమర్రి, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,48,412. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి 1962, 1967, 1972లలో కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో నారాయణ(కాంగ్రెస్), 1983లో సంజీవరావు(కాంగ్రెస్), 1985, 1989, 1994, 1999లలో బోద జనార్దన్(టీడీపీ), 2004లో జి.వినోద్(కాంగ్రెస్), 2009, 2010, 2014లలో నల్లాల ఓదెలు (టీఆర్ఎస్), 2018లో బాల్క సుమన్(టీఆర్ఎస్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2018లో.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ 71,980 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి వెంకటేష్ 43,848 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 53.06 శాతం, కాంగ్రెస్ కు 32.32 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండింది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు 64,867 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ 38,703 ఓట్లు తెచ్చుకున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |