జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో గద్వాల నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. అవి గద్వాల, ధరూర్, మల్దకల్, గట్టు. గద్వాల నియోజకవర్గంలో ఒకవైపు కృష్ణా.. మరోవైపు తుంగభద్ర నదులు ప్రవహిస్తుంటాయి. గద్వాల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల ఓటర్ల శాతం 16గా ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 8,260 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ 83,355 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి 75,095 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణయ్య 3,576 ఓట్లు సాధించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణపై 28,445 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 1,00,057 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 71,612 ఓట్లు పోలయ్యాయి. అయితే 2018 ఎన్నికల తర్వాత డీకే అరుణ పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా కొన్ని నెలల కిందట బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కానీ తెలంగాణ స్పీకర్ డీకే అరుణతో ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇంతలో 2023 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 2023 అసెంబ్లీ ఎన్ని్కల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సరితా తిరుపతయ్య, బీజేపీ నుంచి బోయ శివ పోటీ చేస్తున్నారు. డీకే అరుణకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |