కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం అధికభాగం కరీంనగర్ జిల్లాలో ఉండగా.. మిగిలిన భాగం హన్మకొండలో ఉంది. మొత్తం 2,36,872 ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. 2021లో జరిగిన ఉపఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలతోపాటు హన్మకొండలోని కమలాపూర్ మండలం ఈ నియోజకవర్గం పరిధిలోకే వచ్చింది. 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పీ.నర్సింగ్ రావు విజయం సాధించారు. 1962లో గడిపల్లి రాములు(కాంగ్రెస్), 1967 ఎన్నికల్లో ఎన్ఆర్ పొల్సాని(కాంగ్రెస్), 1972 ఎన్నికల్లో వొడితెల రాజేశ్వర రావు(కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంటకరావు(కాంగ్రెస్) గెలిచారు. 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోతా రాజిరెడ్డి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దుగ్గిరాల వెంకటరావు, 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. 1994,99 ఎన్నికల్లో టీడీపీ తరపున ఈ.పెద్దిరెడ్డి గెలుపొందారు. 2004, 2008 సాధారణ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ నేత వి. లక్ష్మీకాంత రావు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. 2021లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ తమ సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్(టీఆర్ఎస్)పై 23,855 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన ఈటల రాజేందర్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి కే.సుదర్శన్ రెడ్డిపై (కాంగ్రెస్) 57,037 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |