రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలలో ఇబ్రహీంపట్నం ఒకటి. గతంలో భువనగిరి లోక్‌సభ, నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం.. 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, హయాత్‌నగర్, మంచాల, యాచారం మండలాలు ఉన్నాయి. మొత్తం 3,10,756 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,57,740 మంది, మహిళా ఓటర్లు 1,52,917 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్) పై 9,216 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున టి.దేవేందర్ గౌడ్, బీజేపీ తరపున పి.నర్సింహారెడ్డి పోటీ చేశారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్) పై 11,056 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 56,508 ఓట్లు రాగా, రంగారెడ్డికి 47,292 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (బీఎస్పీ) పై 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 72,581 ఓట్లు రాగా, రంగారెడ్డికి 72,205 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |