జనగాం నియోజకవర్గం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనగాం జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. ఈ నియోజకవర్గంలో చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట్ట, జనగాం, మద్దూరు, తరిగిప్పుల, కొమురవెల్లి, ధూల్మిట్ల మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,07,028గా ఉంది. 1957లో జనగాం నియోజకవర్గంగా ఏర్పడింది. 1957, 1962ల వరకు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా కొనసాగగా ఇప్పుడు జనరల్ నియోజకవర్గంగా ఉంది. 1957లో జి.గోపాల్‌రెడ్డి, 1962లో గోకా రామలింగం, 1967లో కమాలుద్దీన్ అహ్మద్, 1972లో కాసాని నారాయణ, 1978లో కోడూరు వర్ధ రెడ్డి, 1983లో రొండ్ల లక్ష్మా రెడ్డి, 1985లో అసిరెడ్డి నర్సింహారెడ్డి, 1989లో పొన్నాల లక్ష్మయ్య, 1994లో చరగొండ రాజి రెడ్డి, 1999లో పొన్నాల లక్ష్మయ్య, 2004, 2009లో పొన్నాల లక్ష్మయ్య, 2014, 2018లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజయం సాధించారు. విభజన తర్వాత.. తెలంగాణ విభజన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్యపై గెలుపొందారు. 2014లో 51379 ఓట్ల తేడాతో.. 2018లో 62024 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2023లో.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జనగాం నుంచి బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆరుట్ల దశమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మరీ ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |