నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కల్వకుర్తి ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థి గుర్కా జైపాల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య 1,99,363గా ఉన్నాయి. తొలుత ఈ నియోజకవర్గం నుంచి 1952లో కాంగ్రెస్ తరఫున ఎమ్. నర్సింగ్ రావు, కేఆర్ వీరస్వామి గెలుపొందారు. ఆ తర్వాత 1957లో టీ. శాంతాబాయి (కాంగ్రెస్), 1962లో వెంకట్‌రెడ్డి (స్వతంత్ర), 1964లో టీ. శాంతాబాయి (కాంగ్రెస్), 1967లో ద్యాప గోపాల్ రెడ్డి (స్వతంత్ర), 1972లో జైపాల్ రెడ్డి (కాంగ్రెస్), 1978 & 1983లలో జైపాల్ రెడ్డి (జనతా పార్టీ), 1985 & 1989లలో జే. చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్), 1994లో యాద్మ కిష్టారెడ్డి (స్వతంత్ర), 1999లో గుర్కా జైపాల్ యాదవ్ (టీడీపీ), 2004లో యాద్మ కిష్టారెడ్డి (కాంగ్రెస్), 2009లో గుర్కా జైపాల్ యాదవ్ (టీడీపీ), 2014లో చల్లా వంశీచాంద్ రెడ్డి (కాంగ్రెస్), 2018లో గుర్కా జైపాల్ యాదవ్ (బీఆర్ఎస్) గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గుర్కా జైపాల్ యాదవ్ విజయం సాధించారు. జైపాల్ యాదవ్‌కు 62,892 ఓట్లు (35.34%) పడగా.. బీజేపీ అభ్యర్థి ఆచారి తల్లోజుకి 59,445 ఓట్లు (33.41%), కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచాంద్ రెడ్డికి 46,523 ఓట్లు (26.14%) పడ్డాయి. ఇక నోటాకు 1,356 ఓట్లు (0.76%) పోలయ్యాయి. మొత్తంగా 87.21 పోలింగ్ శాతం నమోదు అవ్వగా.. గుర్కా జైపాల్ యాదవ్ 3,447 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |