రాష్ట్ర రాజధాని నగర హైదరాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్వాన్ శాసన సభా స్థానం ఒకటి. ఈ శాసన సభ నియోజకవర్గం హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోనికి వస్తుంది. ఏఐఎంఐఎంకు చెందిన కౌసర్ మొహియుద్దీన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో ఏఐఎంఐఎం గెలిచిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,87,626. హైదరాబాద్ నగరంలోని కర్వాన్, టోలీ చౌకీ, జియా గూడ, భీమ్ నగర్, లంగర్ హౌజ్, గోల్కొండ, దర్గా నగర్, మెహదీ పట్నం, హకీం పేట, బడా బండా మొదలైన ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజక వర్గం ఏర్పాటైన తొలి పర్యాయంలో అంటే 1952లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నరేంద్ర గెలుపొందారు. ఆ తర్వాత 1978లో శివ లాల్ (కాంగ్రెస్), 1983లో బకర్ అఘా (స్వతంత్ర), 1985, 89, 94 ఎన్నికల్లో వరుసగా బీజేపీకి చెందిన బద్దం బాల్ రెడ్డి గెలుపొందారు. 1999 నుంచి కార్వాన్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 2014, 2018లో కౌసర్ మొహియుద్దీన్ గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో కార్వాన్ నియోజకవర్గం నుంచి కౌసర్ మొహియుద్దీన్ మంచి మెజారీటీతో గెలుపొందారు. 52.8 శాతం ఓట్లతో 50 వేల పైచిలుకు మెజారిటీ గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ నాయకుడు అమర్ సింగ్ కేవలం 22.5 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ఈ నియోజక వర్గం నుంచి కౌసర్ మొహియుద్దీన్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఏఐఎంఐఎం తరఫున బరిలోకి దిగిన మొహియుద్దీన్ మొత్తం 54 శాతం ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బద్దం బాల్‌రెడ్డి (బీజేపీ) 30 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |