తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గమే కొడంగల్. ఈ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఒకటి. ఇది మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రాస్‌పేట, దండ్యాల్, దౌల్తాబాద్ మండలాలతోపాటు నారాయణ జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి మండలాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,38,300గా ఉంది. ఈ నియోజకవర్గంలో గతంలో గెలుపొందినవారి జాబితాను పరిశీలిస్తే.. 1952లో అనంత్ రెడ్డి వీరస్వామి(కాంగ్రెస్), 1962లో రుక్మా రెడ్డి (స్వతంత్ర), 1967లో కే. అచ్యుతా రెడ్డి (కాంగ్రెస్), 1972లో నందరమ్ వెంకటయ్య(స్వతంత్ర), 1978లో గుర్నాథ్ రెడ్డి (స్వతంత్ర), 1983లో గుర్నాథ్ రెడ్డి (కాంగ్రెస్), 1985లో నందరం వెంకటయ్య (టీడీపీ), 1989లో గుర్నాథ్ రెడ్డి (కాంగ్రెస్), 1994లో నందరమ్ వెంకటయ్య (టీడీపీ), 1996(ఉపఎన్నిక)లో ఎన్.సూర్య నారాయణ(కాంగ్రెస్), 1999, 2004లలో గుర్నాథ్ రెడ్డి (కాంగ్రెస్), 2009, 2014లలో రేవంత్ రెడ్డి (టీడీపీ), 2018లో పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2018లో పోటీ ఎవరెవరి మధ్య? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన పట్నం మహేందర్ రెడ్డి 9,319 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. మొత్తం 81.98 శాతం ఓటింగ్ నమోదవ్వగా మహేందర్ రెడ్డికి 80,756 ఓట్లు, రేవంత్ రెడ్డికి 71,435 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ సీటు కాస్తా టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన గుర్నాథ్ రెడ్డిపై 14,614 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డీ.విట్టల్ రావుకి 36,304 ఓట్లు పడడం విశేషం.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |