నాగర్ కర్నూల్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కొల్లాపూర్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం బలంగా ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 45 వేల 766 కాగా.. అందులో పురుష ఓటర్ల సంఖ్య లక్షా 4 వేల 43 మంది, మహిళా ఓటర్లు లక్షా 962 మంది ఉన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్, వీపనగండ్లా, కోడేర్, పానగల్, పెద్ద కొత్తపల్లె అనే మండలాలు ఉన్నాయి. 1957లో ఎం.నర్సింగరావు(కాంగ్రెస్), 1962లో రంగ్ దాస్(కాంగ్రెస్), 1967లో బి.నారాయణ రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి), 1972లో కే.రంగ్ దాస్(స్వతంత్ర అభ్యర్థి), 1978,1983, 1985లలో వరుసగా వెంటకటేశ్వర రావు(కాంగ్రెస్), 1994లో మధుసూదన్ రావు(టీడీపీ), 1999లో జూపల్లి కృష్ణా రావు స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందగా, 2004, 2009ల్లో కాంగ్రెస్ నుంచి, 2012, 2014ల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నుంచి, 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి(కాంగ్రెస్) నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ తరఫున్ పోటీ చేసి విక్టరీ సాధించారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డికి 80 వేల 611 ఓట్లు రాగా, బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన కృష్ణారావుకి 68 వేల 68 ఓట్లు వచ్చాయి.బీజేపీ నుంచి పోటీ చేసిన సుధాకర రావుకుి 13 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరిపోయారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |