జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో కోరుట్ల ఒకటి. ఇందులో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలు ఉన్నాయి. 2009 నుంచి జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో ప్రతిసారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీనే ఇక్కడ విజయం సాధించింది. 1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టీ.వెంకట రమణారెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే.రాములుపై 11 వేల 523 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీకి చెందిన కొమిరెడ్డి రాములు తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై 5 వేల 598 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొమిరెడ్డి రాములుకు 31 వేల 917 ఓట్లు రాగా, విద్యాసాగర్ రావుకి 26 వేల 319 ఓట్లు లభించాయి. 2009, 2010(ఉపఎన్నికలు), 2014, 2018లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) నుంచి విజయం సాధించారు. ప్రతిసారి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ఓడిపోయారు. కోరుట్ల నియోజకవర్గంలో 1,08,859 మంది పురుషులు, 1,18,506 మంది మహిళలు, ఒకరు ఇతరులు, 46 మంది సర్వీస్ ఓటర్ల చొప్పున మొత్తం 2,27,366 మంది ఉన్నారు. 2018లో పరిస్థితి ఇదీ.. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ లీడర్ జువ్వాడి నర్సింగరావుపై విక్టరీ సాధించారు. వీరిరువురి మధ్య 31 వేల 220 ఓట్ల తేడా ఉంది. విద్యాసాగర్ రావుకు 84 వేల 605 ఓట్లు పోలవగా, నరసింగరావుకి 53 వేల 385 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వెంకట్ 15వేలకు పైగా ఓట్లు సాధించి మూడో స్ధానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ వెలమ సామాజిక వర్గం పట్టు నిలుపుకుంటూ వస్తోంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |