మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మహబూబాబాద్ ఒకటి. ఈ నియోజకర్గంలో మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇనుగర్గి మండలాలు ఉన్నాయి. మొత్తం 2,36, 954 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 1,17,580 ఓట్లు ఉండగా.. మహిళా ఓటర్లు 1,19,343 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్.. తన సమీప ప్రత్యర్థి పోరిక బలరాం (కాంగ్రెస్) పై 13,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు 85,397 ఓట్లు రాగా.. బలరాంకు 71,863 ఓట్లు వచ్చాయి. ఇక 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత.. తన సమీప ప్రత్యర్థి అజ్మీరా చందూలాల్ (బీఆర్ఎస్) పై 15,367 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కవితకు 66,209ఓట్లు రాగా.. చందూలాల్‌కు 50,842 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్.. తన సమీప ప్రత్యర్థి మాలోత్ కవిత (కాంగ్రెస్) పై 9,315 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు 78,370 ఓట్లు, కవితకు 69,055 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |