మహబూబ్ నగర్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఈ స్థానం కూడా ఉంది. మహబూబ్ నగర్, హన్వాడ మండలాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ జనాభా ఎక్కువగా ఉండడంతో అధిక మండలాలను కలిపే వీలు లేకుండా పోయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,760గా ఉంది. వీరిలో పురుషులు 1,15,028 మంది, మహిళలు 1,14,724గా ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్.రాజేశ్వర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి సయ్యద్ ఇబ్రహీం (బీఆర్ఎస్) పై 5,137 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన రాజేశ్వర్ రెడ్డి.. 2011 అక్టోబర్‌లో మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక 2012లో ఉప ఎన్నికలు జరగగా బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి తన సమీప ప్రత్యర్థి సయ్యద్ ఇబ్రహీంపై (బీఆర్ఎస్) 1,859 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వి.శ్రీనివాస్ గౌడ్.. తన సమీప ప్రత్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ) పై 3,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు 45,447 ఓట్లు రాగా.. శ్రీనివాస్ రెడ్డికి 42, 308 ఓట్లు వచ్చాయి. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి ఎమ్.చంద్రశేఖర్‌పై (టీడీపీ) 57,775 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు 86,474 ఓట్లు పడగా, చంద్రశేఖర్‌కు 28,699 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |