మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. గతంలో ఇబ్రహీంపట్నం, మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం.. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మహేశ్వరం, కందుకూర్, సరూర్ నగర్ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 4,23,261 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,19,059 మంది, మహిళా ఓటర్లు 2,04,152 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు... 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డి (టీడీపీ) పై 7,833 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డికి 65,077 ఓట్లు, తీగల కృష్ణారెడ్డికి 57,244 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్) పై 30,784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డికి 93,305 ఓట్లు రాగా, రంగారెడ్డికి 62,521 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డి (బీఆర్ఎస్) పై 9,227 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డికి 95,481 ఓట్లు రాగా, తీగల కృష్ణారెడ్డికి 86,254 ఓట్లు వచ్చాయి. అయితే తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |