మంచిర్యాల జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఇది పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇందులో మంచిర్యాల, దండేపల్లి, లక్సెట్టిపేట్, నస్పూర్, హజీపూర్ మండలాలున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నడిపల్లి దివాకర్ రావు ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,64,186 మంది ఉన్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా సూరే విశ్వనాథరావు(సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), 1957లో పితాంబరరావు(కాంగ్రెస్), 1962లో పితాంబరరావు(స్వతంత్ర అభ్యర్థి), 1967లో వీఎన్ రావు(కాంగ్రెస్), 1972లో జేవీ నర్సింగరావు(కాంగ్రెస్), 1978లో లక్ష్మయ్య(జనతా పార్టీ), 1983లో మురళీ మనోహర్ రావు(టీడీపీ), 1985, 1989లలో జీవీ సుధాకర్ రావు(కాంగ్రెస్), 1994లో గోనె హన్మంతరావు(టీడీపీ), 1999, 2004లలో నడిపల్లి దివాకర్ రావు(కాంగ్రెస్), 2009, 2010లలో గడ్డం అరవింద్ రెడ్డి(టీఆర్ఎస్), 2014, 2018లో నడిపల్లి దివాకర్ రావు(టీఆర్ఎస్) నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దివాకర్ రావుకి 75,360 ఓట్లు పడగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్ రావుకి 70,512 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునాథ్ కి 5,018 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 45.20 శాతం, కాంగ్రెస్ కి 42.29 శాతం, బీజేపీకి 3.01 శాతం ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |