• Home » Telangana » Assembly Elections » Medak

మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెదక్ ఒకటి. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఈ నియోజకవర్గంలో పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట, మెదక్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,99,553. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి తెలంగాణ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌కు చెందిన తన సమీప అభ్యర్థి ఏ.ఉపేందర్ రెడ్డిపై విజయం సాధించారు. 1957లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన వెంకటేశ్వర్ రావు గెలుపొందారు. 1962 నాటి ఎన్నికల్లో సీపీఐ తరపున కేవల్ ఆనందా దేవి విజయం సాధించారు.1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. రెడ్డి గెలుపొందగా ఆ తరువాతి సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రామచందర్ రావు గెలిచారు. 1978 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎస్. లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం, 1983 నాటి ఎన్నికల్లో రామచందర్ రావు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1985 నాటి ఎన్నికల్లో మళ్లీ ఆయన టీడీపీ తరుపు పోటీ చేసి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరపున పి.నారాయణ రెడ్డి గెలవగా 1994,99 నాటి ఎన్నికల్లో టీడీపీ తరపున రామచందర్ రావు వరుసగా గెలుపొందారు. 2004లో పి.శశిధర్ రెడ్డి(కాంగ్రెస్), 2009 నాటి ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు(టీడీపీ) విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ(2018, 2014) టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నాటి ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి ఎ.ఉపేందర్ రెడ్డి(కాంగ్రెస్)‌పై 47,983 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 నాటి ఎన్నికల్లో కూడా ఆమె తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై 39,600 వోట్ల మెజారిటీతో గెలుపొందారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

మెదక్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి