మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలలో మేడ్చల్ ఒకటి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఈ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వస్తుంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం 13సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఏడుసార్లు గెలిచాయి. అలాగే టీడీపీ నాలుగు సార్లు, బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 5,01,281 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,60,986 మంది, మహిళా ఓటర్లు 2,40,235 మంది ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్, శామీర్‌పేట్, ఘట్‌కేసర్, కీసర, మూడుచింతలపల్లి, మేడిపల్లి, కాప్రా మండలాలు ఉన్నాయి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ నుంచి 1978లో గెలవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఎన్.ప్రభాకర్ గౌడ్ (టీడీపీ) పై 5,570 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి 69,312 ఓట్లు, ప్రభాకర్ గౌడ్‌కు 63,742 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సుధీర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ (టీడీపీ) పై 43,455 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి 1,14,235 ఓట్లు రాగా.. జంగయ్య యాదవ్‌కు 70, 780 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున చామకూర మల్లారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) పై 87,990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డికి 1,67,324 ఓట్ల రాగా.. లక్ష్మారెడ్డికి 79,334 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |