సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన ముషీరాబాద్ శాసనసభ స్థానానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,75,016 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, దోమల్‌గూడ, రామ్‌నగర్, కవాడీగుడ, ఆజమాబాద్, పార్సీగుట్ట, అడిక్‌మెట్‌తో పాటూ నల్లకుంట, బాగ్‌లింగంపల్లి, విద్యానగర్ ప్రాంతాల్లోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2018 నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన ముఠా గోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్‌పై 36,910 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు తరువాత జరగిన తొలి ఎన్నికలో(2014) బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌కు చెందిన ముఠా గోపాల్‌పై 27,386తో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ నేత టి.మణెమ్మ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య మూడు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ తొలి హోమ మంత్రి ఎన్.నరసింహారెడ్డి కూడా రెండు సార్లు ముషిరాబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. జనతా పార్టీ తరఫున ఓమారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ తరుపున మరోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |