నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నకిరేకల్ ఒకటి. ఈ ప్రాంతంలో చాలా కాలం పాటు కమ్యూనిస్టు పార్టీలకు మంచి పట్టు ఉండేది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు చాలా సార్లు విజయం సాధించారు. గతంలో జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం.. 2009లో నియోజకవర్గాల పునర్విభన తర్వాత ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలోకి వెళ్లింది. ఈ నియోజకవర్గంలో నకిరేకల్, చిట్యాల, కట్టంగూరు, నార్కట్‌పల్లి, కేతేపల్లి, యాదాద్రి జిల్లాలోని రామన్నపేట మండలాలు ఉన్నాయి. అలాగే మొత్తం 2,01,134 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,01,338 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 99,796 మంది ఉన్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య.. తన సమీప ప్రత్యర్థి మామిడి సర్వయ్య (సీపీఎం) పై 12,176 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లింగయ్యకు 72,023 ఓట్లు రాగా.. సర్వయ్యకు 59,847 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన వేముల వీరేశం.. తన సమీప ప్రత్యర్థి చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్) పై 2,370 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వీరేశంకు 62,445 ఓట్లు రాగా, లింగయ్యకు 60,075 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య.. తన సమీప ప్రత్యర్థి వేముల వీరేశం (బీఆర్ఎస్) పై 8,259 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లింగయ్యకు 93,699 ఓట్లు రాగా, వీరేశంకు 85,440 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |