నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటి. ఈ నియోజకవర్గంలో నల్గొండ, తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,82,388 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 90,222 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 92,166 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి .. తన సమీప ప్రత్యర్థి ఎన్.నరసింహారెడ్డి (సీసీఎం) పై 8,377 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కోమటి రెడ్డి వెంకట రెడ్డికి 60,665 ఓట్లు రాగా.. నరసింహారెడ్డికి 52,288 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి (ఇండిపెండెంట్) పై 10,547 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డికి 60,774 ఓట్లు రాగా.. భూపాల్ రెడ్డికి 50,227 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (కాంగ్రెస్) పై 23,698 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భూపాల్ రెడ్డికి 98,792 ఓట్లు రాగా.. కోమటిరెడ్డి వెంకట రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |