నిర్మల్ జిల్లా కేంద్రం ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. ప్రస్తుతం ఇక్కడి నుంచి మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,47,495 మంది. పురుషులు 1,17,563 మంది, స్త్రీలు 1,29,914 మంది ఉన్నారు. ఇక్కడ నిర్మల్, దిలావర్ పూర్, లక్ష్మణచాంద, మామదా, సారంగాపూర్, నర్సాపూర్(జీ),సోన్, నిర్మల్ రూరల్ మండలాలున్నాయి. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా మహేశ్వర్ రెడ్డి.. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత బీఎస్పీ నుంచి బరిలో దిగిన ఇంద్రకరణ్ రెడ్డి 2014లో గెలిచారు. అదే ఊపును కొనసాగిస్తూ 2018లోనూ ఇంద్రకరణ్ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఇంద్రకరణ్ కు ప్రధాన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శ్రీహరి రావు నిలిచారు. ఆ ఎన్నికల్లో ఇంద్రకరణ్ కి 61 వేల 368 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ నుంచి శ్రీహరి రావుకి 52 వేల 871 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో... 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 79 వేల 985 ఓట్లు సాధించగా.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి 70 వేల 714 ఓట్లు సాధించారు. బీజేపీ నుంచి స్వర్ణా రెడ్డి 16 వేల 900, ఓట్లు తెచ్చుకున్నారు. కేవలం 8 వేల మెజారిటీ ఇంద్రకరణ్ ఆ ఎన్నికల్లో గట్టేక్కారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని పొలిటికల్ నిపుణులు అంటున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |