తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్‌టాపిక్‌గా మారిన వ్యక్తుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి నున్నా రవికుమార్ బరిలోకి దిగగా.. సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీచేస్తున్నారు. ప్రధానంగా వీరిమధ్య పోటీ ఉండనుంది. ముఖ్యంగా పొంగులేటి, ఉపేందర్ మధ్య గట్టిగా పోటీ ఉంటుందనే విశ్లేషణలున్నాయి. ఇక 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం బీఆర్ఎస్‌లోకి చేరారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రొఫైల్ విషయానికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో (ఆనాటి టీఆర్ఎస్ పార్టీ)లో చేరారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతిచ్చిన ఆయన ఆ తర్వాత తిరుబాటు ఎగురవేశారు. 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 58 | 0 | 2,147,483,647 | 12th Pass | 435,324,224 |