హన్మకొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో పరకాల స్థానం ఒకటి. పరకాల, ఆత్మకూర్, దామెర, నడికూడ, డీసుకొండ, ఖిల్లావరంగల్, సంగెం మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,07,810 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,02,019 మంది, మహిళా ఓటర్లు 1,05,788 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ.. తన సమీప ప్రత్యర్థి మొలుగూరి భిక్షపతి (బీఆర్ఎస్) పై 12,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కొండా సురేఖకు 69,135 ఓట్లు రాగా.. భిక్షపతి 56,335 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొండా సురేఖ.. వైఎస్సార్ మరణానంతరం మారిన రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. 2018 ఎన్నికల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి కొండా సురేఖపై (కాంగ్రెస్) 46,519 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ధర్మారెడ్డికి 1,05,903 ఓట్లు రాగా కొండా సురేఖకు 59,384 ఓట్లు వచ్చాయి. ఇక 2012 ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి తన సమీప ప్రత్యర్థి కొండా సురేఖపై (వైసీపీ) 1,562 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భిక్షపతికి 51,936 ఓట్లు రాగా.. కొండా సురేఖకు 50,374 ఓట్లు వచ్చాయి. కాగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ముద్దగాని సహోదర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 9,108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ధర్మారెడ్డికి 67,432 ఓట్లు రాగా.. సహోదర్ రెడ్డికి 58,324 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |