ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒకటి. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో ఉండే ఈ శాసనసభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,75,275గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇది ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగం పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, చందానగర్, కొండాపూర్, మండలాలు.. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బాలానగర్(పార్ట్), కుకట్‌పల్లి(ఎం)(పార్ట్), కుకట్‌పల్లి(ఎం) వార్డ్ నంబర్ 1-4, ఆల్విన్ కాలనీ, ఇక హైదరాబాద్ జిల్లాలోని వివేకనందానగర్ కాలనీ, హఫీజ్‌పేట్, సంగారెడ్డి జిల్లాలోని భెల్ టౌన్‌షిప్ మండలాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి జాబితా విషయానికి వస్తే 2009-14లో ఎం.భిక్షపతి యాదవ్(కాంగ్రెస్), 2014-18లో అరికేపూడి గాంధీ(టీడీపీ), 2018-2023 వరకు అరికేపూడి గాంధీ(బీఆర్ఎస్) నుంచి ప్రతినిధ్యం వహించారు. ఇక 2018లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరగగా టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఏకంగా 44,295 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. గాంధీకి 143,307 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి వీ.ఆనంద్ ప్రసాద్‌కి 99,012 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గజ్జల యోగానంద్‌కు 22,106 ఓట్లుపడ్డాయి. కాగా నోటాకు 3,637 ఓట్లుపడడం గమనార్హం. ఇక 2009 విషయానికి వస్తే కాంగ్రెస్ తరపున నిలబడిన ఎం భిక్షపతి యాదవ్, టీడీపీ అభ్యర్థి మువ్వా సత్యనారాయణ మధ్య ప్రధాన పోటీ జరిగింది. భిక్షపతి యాదవ్ 2 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |