సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన కోనేరు కోనప్ప ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కౌతల, బెజ్జూరు, కాగజ్ నగర్, సిర్పూర్(టి), దహెగావ్, పెంచికల్‌పేట, చింతలమానేపల్లి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 2 లక్షలకుపైగా ఓటర్లున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలుపొందిన బుచ్చయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1957లో జి.వెంకటస్వామి(కాంగ్రెస్), 1957లో వెంకటస్వామి(కాంగ్రెస్),1962, 1967లలో సంజీవ రెడ్డి(కాంగ్రెస్), 1972, 1978లలో కేవీ కేశవులు(కాంగ్రెస్), 1983లో కేవీ నారాయణరావు(టీడీపీ), 1985లో కేవీ నారాయణ(టీడీపీ), 1989, 1994లలో పాల్వాయి పురుషోత్తమరావు(స్వతంత్ర), 1999లో పాల్వాయి రాజ్యలక్ష్మీ(టీడీపీ), 2004లో కోనేరు కోనప్ప(కాంగ్రెస్), 2009, 2010లలో కె.సమ్మయ్య, 2014లో కోనేరు కోనప్ప(బీఎస్పీ), 2018లలో కోనేరు కోనప్ప(టీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018లో.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప 83,088 ఓట్లతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి డా.పాల్వాయి హరీష్ బాబుపై గెలుపొందారు. కాంగ్రెస్ కు 59,052, బీజేపీ అభ్యర్థి డా.కోటపల్లి శ్రీనివాస్ కు 6,279 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ కు 50.57 శాతం, కాంగ్రెస్ కు 35.94 శాతం ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, బీజేపీ నుంచి డా. పాల్వాయి హరీష్ బాబు పోటీలో నిలుస్తున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |