Home » Telangana » Assembly Elections » Uppal
హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్ కూడా ఒకటి. 2007లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన బేతి సుభాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉప్పల్, కాప్రా పురపాలక సంఘాలు ఉన్నాయి. ఇందులో మల్లాపూర్, మీర్‌పేట్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ భగాయత్, ఉప్పల్ ఖల్సా, రామంతాపూర్ ఖల్సా, నాగోల్ మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 5 లక్షల 10 వేల 187 ఉండగా పురుష ఓటర్లు.. 2 లక్షల 44 వేల 657 మంది, మహిళా ఓటర్లు 2 లక్షల 44 వేల 657 మంది ఉన్నారు. 2018లో ఎవరెవరి మధ్య పోటీ..? ఉప్పల్ నుంచి 2018లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్ రెడ్డి సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో దిగిన వీరేందర్ గౌడ్ పౌ 48 వేల 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ టైంలో బీజేపీ నేత ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ 26 వేల 700 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉప్పల్ నుంచి గెలిచారు. ఇక 2014లో ఉప్పల్ నుంచి బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 82 వేల 395 ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బేతి సుభాష్ రెడ్డి 68 వేల 226 ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి బండారి లక్ష్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |