వరంగల్ అర్బన్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో వర్ధన్నపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో వర్ధన్నపేట, హనుమకొండ, హసన్‌పర్తి, ఐనవోలు, ఖాజీపేట, ఖిల వరంగల్, పర్వతగిరి, వరంగల్ మండలాలు ఉన్నాయి. మొత్తం 2,49,545 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,23,989 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,25,541 మంది ఉన్నారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ తన సమీప ప్రత్యర్థి పగిడిపాటి దేవయ్యపై (టీజేఎస్) 99,240 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో రమేష్‌కు 1,31,252 ఓట్లు రాగా.. దేవయ్యకు 32,012 ఓట్లు వచ్చాయి. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ తన సమీప ప్రత్యర్థి విజయరామారావుపై (బీఆర్ఎస్) 6,584 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శ్రీధర్‌కు 57,871 ఓట్లు రాగా విజయరామారావుకు 51,287 ఓట్లు పడ్డాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ తన సమీప ప్రత్యర్థి కొండేటి శ్రీధర్‌పై (కాంగ్రెస్) 86,349 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రమేష్‌కు 1,17,254 ఓట్లు రాగా.. శ్రీధర్‌కు 30,905 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |