కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని రామచంద్రరావు హెచ్చరించారు.
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.
జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు.
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్‌ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని సూచించారు.
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారని.. భట్టి, పొంగులేటి, ఉత్తమ్ ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు.
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.