ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని వాపోతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రభాకర్రావు కీలకంగా ఉన్నారు. ఆయనను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలోపడిపోయి ఇళ్లకే పరిమితమైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఫుల్ జోష్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు,
ఓ పిన తండ్రి 10 ఏళ్ల బాలుడ్ని దారుణంగా హత్య చేశాడు. ఇరుగు పొరుగు పిల్లలతో గొడవ పడుతుండటంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హైదరాబాద్లోని చాంద్రాయణ గుట్టలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ మహా నగరంలోరి కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు తక్కువ ధరకు విక్రయించిన బెండకాయ... ప్రస్తుతం రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను ఉరివేసి హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
హైదరాబాద్ మహా నగరంలోమరో కొత్త ఎక్స్ప్రెస్ వే కు అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.