Home » Telangana
రాజకీయాలకతీతంగా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల అబివృద్ధికి సహకారం అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గులో మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే, వీఎంఆర్ కప్పు క్రీడా పోటీలను ప్రారంభించారు.
భారతదేశం మొత్తాన్ని సైకిల్‌పై చుట్టి రావాలని యువకులు సంకల్పించారు. ముగ్గురు యువకులు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుహ్యంగా ముగ్గురు కేరళలోని కొచ్చిలో కలిసి చేయి, చేయి కలిపి ఒక్కటిగా యాత్రకు సాగుతున్నారు.