Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో..

ABN, Publish Date - Dec 28 , 2023 | 04:42 PM

ప్రముఖ కొలంబియన్ పాప్ సింగర్ షకీరా బెల్లీ డాన్స్‌ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. గ్రామీ అవార్డు విజేత షకీరాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 1/6

ప్రముఖ కొలంబియన్ పాప్ సింగర్ షకీరా బెల్లీ డాన్స్‌ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. గ్రామీ అవార్డు విజేత షకీరాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సొంత ఊర్లో షకీరా 21 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందిన విషయం తెలిసిందే.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 2/6

ఆమె సొంత గ్రామమైన కొలంబియాలోని హోం సిటీ బారంక్విలాలో మ‌గ‌ద‌లీనా న‌ది ప‌క్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సిటీ మేయ‌ర్ జామీ పుమెరేజో ఈ స్టాచ్యూని మంగళవారం ఆవిష్కరించారు. పొడవాటి చేతులు, రింగు రింగుల జుట్టుతో బెల్లీ డాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న షకీరా విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 3/6

యువతులు కూడా తమ కలలను నెరవేర్చుకోవచ్చు.. అనే సందేశాన్ని ఇస్తూ ఆర్టిస్టు యినో మార్క్వేజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. షకీరా చిన్నతనంలో కచేరీల్లో ప్రదర్శన ఇస్తున్నప్పటి నుంచి తాను గమనిస్తున్నట్లు మార్క్వేజ్ తెలిపారు.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 4/6

తన విగ్రహాన్ని ఆవిష్కరించడంపై షకీరా స్పందించింది. బారంక్విలా ఎప్పటికీ తన సొంత ఊరే అని, తన ఊర్లో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం షకీరా మియామీలో నివాసం ఉంటోంది.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 5/6

షకీరా పాటలు పాడడమే కాకుండా పైస్ డెస్కాల్జోస్, బేర్ ఫుట్ అనే సంస్థల ద్వారా పిల్లల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. షకీరా విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Shakira Statue: పాప్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం.. ఆమె సొంత ఊర్లో.. 6/6

ఇటీవలే షకీరా పన్ను ఎగవేత కేసులో భారీగా జరిమానా చెల్లించిన విషయం తెలిసిందే. 2012, 2014 మధ్యలో ఆదాయానికి సంబంధించి 14.5 మిలియన్ యూరోల పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ప్రాసిక్యూటర్లు 2018లో ఆరోపించారు.

Updated at - Dec 28 , 2023 | 05:20 PM