Share News

అట్టహాసంగా జేసీ అశ్మితరెడ్డి నామినేషన

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:39 AM

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన దాఖలు చేశారు.

అట్టహాసంగా జేసీ అశ్మితరెడ్డి నామినేషన
అశ్మిత రెడ్డిని ఆశీర్వదిస్తున్న తల్లి జేసీ ఉమా రెడ్డి

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌ 19: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన దాఖలు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని సీబీరోడ్డు పసుపుమయంగా మారింది. స్థానిక నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అశ్మితరెడ్డి అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జేసీ పవనరెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని పోలీ్‌సస్టేషన సమీపంలో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుగ్గరామలింగేశ్వరునికి అశ్మిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి నుంచి బయలుదేరిన అశ్మితరెడ్డి, పవనరెడ్డి సంజీవనగర్‌ మొదటిరోడ్డు, పుట్లూరురోడ్డు మీదుగా గాంధీసర్కిల్‌కు చేరుకున్నారు. అంతకుమునుపే అక్కడికి చేరుకున్న వేలాదిమంది కార్యకర్తలు ఆయనకు బాణాసంచా పేలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మరో వాహనంలో కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీ వద్దకు చేరుకున్నారు. అనంతరం నామినేషన దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా శుక్రవారం జేసీ అశ్మితరెడ్డి నామినేషన పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాంభూపాల్‌రెడ్డికి అందించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని భాస్కర్‌రెడ్డి బలపరిచారు. అశ్మిత రెడ్డి నామినేషన దాఖలు చేస్తుండడంతో డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నిబంధనల ప్రకారం ర్యాలీగా వచ్చిన అశ్మితరెడ్డితోపాటు కదిరి శ్రీకాంతరెడ్డి, రంగనాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కార్యాలయంలోకి అనుమతించారు.

ర్యాలీలో కొద్దిసేపు ఉద్రిక్తత

గాంధీసర్కిల్‌ నుంచి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి నిబంధనలమేరకు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటి రావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయానికి వందమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన బారికేడ్లు, పోలీసు అధికారులు ఉన్నప్పటికీ దాటుకొని కార్యాలయంవైపు వెళ్లడానికి ప్రయత్నించడంతో వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఉన్నట్లుండి ఆయనతోపాటు వెళ్లడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసు అధికారులు కల్పించుకొని ప్రభాకర్‌రెడ్డిని అక్కడి నుంచి బయటకు వెళ్లాలని సూచించడంతో ఆయన బయటకు రావడం కనిపించింది.

==============

Updated Date - Apr 20 , 2024 | 12:39 AM