ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్ అసిస్టెంట్, వలంటీర్లు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:04 AM
ధర్మవరంరూరల్, ఏప్రిల్19: మండలంలోని కుణుతూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్19: మండలంలోని కుణుతూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో అదేగ్రామానికి చెందిన ఫీల్డ్‌అసిస్టెంట్ రాజు, వలంటీర్లు ప్రమీల, దీప పాల్గొని ఎమ్మెల్యేతో ఫొటో దిగారు. అదేవిధంగా మరో వలంటీర్ లత ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే వస్తున్నారని ప్రచారానికి రావాలని ప్రజలకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కొంతమంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు.