Share News

మీ కూలీగా పనిచేస్తా... ఓటుతో ఆశీర్వదించండి

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:35 AM

మీ కూలీగా పని చేస్తా... ఓటుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అభ్యర్థించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో టీడీపీ నాయకులతో కలసి శుక్రవారం రోడ్డుషో నిర్వహించారు.

మీ కూలీగా పనిచేస్తా... ఓటుతో ఆశీర్వదించండి
తగ్గుపర్తి గ్రామంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

రోడ్‌ షోలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

బెళుగుప్ప, ఏప్రిల్‌ 19: మీ కూలీగా పని చేస్తా... ఓటుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అభ్యర్థించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో టీడీపీ నాయకులతో కలసి శుక్రవారం రోడ్డుషో నిర్వహించారు. గ్రామగ్రామాన ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి గజమాలతో స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. మండలంలో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు రెండు చెరువులను కృష్ణాజలాలతో నింపామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల మంజూరు చేయించానన్నారు. జగన ఓ పండు లాంటి వ్యక్తి రాషా్ట్రన్ని బ్రష్టు పట్టించారని అన్నారు. ఇంటికి త్వరలో సాగనంపుదామని పిలుపునిచ్చారు. రిజర్వాయరు ఊట నీటి ముప్పు పరిష్కరించడానికి ఆర్‌అండ్‌ఆర్‌ కింద మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. అసమర్థ విశ్వేశ్వరరెడ్డి మూడు నెలల్లో సమస్య తీరుస్తానని చేతులెత్తేశాడని విమర్శించారు. టీడీపీని గెలిపించడం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఒక్క అభివృద్ధి పనైనా చేశావా అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూటమిలో ఉన్నారని, ఇక నుంచి వైసీపీ ఆటలు సాగవన్నారు. మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, జనసేన ఇనచార్జి గౌతం, కన్వీనర్‌ ప్రసాద్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ యూత నాయకులు

మండలంలోని జీడిపల్లి గ్రామ వైసీపీ యూత నాయకులు కే మధు, కే శివ శుక్రవారం పయ్యావుల కేశవ్‌ సమక్షంలో టీడీపీలోకి చేరారు. వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

పయ్యావుల కేశవ్‌ను ఆశీర్వదించండి

విడపనకల్లు: ఉరవకొండ అబివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టీడీపీ ఆభ్యర్థి పయ్యావుల కేశవ్‌ను ఆశీర్వదించాలని ఆయన కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహా గడేకల్లు ప్రజలను కోరారు. మండలంలోని గడేకల్లు గ్రామంలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటి ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. విక్రమసింహా మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతీరాలన్నా, పేదరికం పోవాలన్నా టీడీపీకి అందరూ అండగా నిలవాలని కోరారు. బీడీ చిన్న మారయ్య, భీమలింప్ప, దేవేంద్ర, శ్రీనివాసులు, శ్రీనావస్‌ చౌదరి, రాము పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:35 AM