Share News

సైకో ముఖ్యమంత్రిని సాగనంపుదాం: సవిత

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:24 AM

టీడీపీ నాయకుడిని, కార్యక ర్తలను వేధిస్తూ... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని సాగనంపుదామని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పిలుపునిచ్చా రు.

సైకో ముఖ్యమంత్రిని సాగనంపుదాం: సవిత
తురకలాపట్నంలో రోడ్‌షోలో పాల్గొన్న సవిత తదితరులు

ఊరూరా ఘనస్వాగతం

రొద్దం, ఏప్రిల్‌ 19 : టీడీపీ నాయకుడిని, కార్యక ర్తలను వేధిస్తూ... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని సాగనంపుదామని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పిలుపునిచ్చా రు. రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం, పెద్ది పల్లి, పాతర్లపల్లి, పెద్దకోడిపల్లి, లోచర్ల, బూచర్ల, కొత్తూ రు, రాగిమేకలపల్లి, కంచిసముద్రం, కోగిర, ఎల్‌జీబీ నగర్‌ తదితర ప్రాంతాల్లో సవిత శుక్రవారం రోడ్‌షో చేపట్టారు. ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి, రాష్ట్రాఅభివృద్ధిని పట్టించుకోకి ప్రజలను నట్టేట ముంచారన్నారు. మద్యం, ఇసుక మైనింగ్‌లలో వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకా లతో ప్రజల పేదరికాన్ని మార్చేస్తారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కనబడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఊరూరా ఘనస్వాగతం అభించింది. తురకలాపట్నంలో యువ నాయకులు పూలహారంతో, మహిళలు హారతులతో స్వాగతం పలికారు. పాతర్లపల్లి, లోచర్ల, పెద్దకోడి పల్లి, రాగిమేకల పల్లి, కోగిర గ్రామాల్లో పెద్దఎత్తున పూలు చల్లుతూ సవితకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీపీనాయుడు, మాధవనాయుడు, చంద్రమౌళి, సుబ్బరత్నమ్మ, నరసింహులు, టైలర్‌ ఆంజనేయులు, నరసింహులు, నరహరి, శ్రీనాథ్‌చౌదరి, తురకలాపట్నం యువ నాయకులు హరి, షన్ముఖ తదితరులు పాల్గొన్నారు.

పలువురి చేరిక : రొద్దం మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు శుక్రవారం టీడీపీలో చేరా రు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత వారికి మండల కేం ద్రంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పాత ర్లపల్లి, బీదానిపల్లి, శ్యాపురానికి చెందిన వైసీపీ కార్యక ర్తలు తిమ్మయ్య, క్యాతేనాయక్‌, సుగాలి లక్ష్మణ్ణ, నాగా ర్జున, కంబాలపల్లికి చెందిన పాఠశాల కమిటీ చైర్మన రమేష్‌, శంకరప్ప, అంజి, సీసీ వెంకటరాముడు, ముని మడుగుకు చెందిన నీరుగంటి మల్లికార్జున, నీరుగంటి రామాంజి నేయులు, గంగాధర్‌, రామకృష్ణ, పెన్నక్కగారి నాగేంద్ర, పెన్నక్కగారి అంజనేయులు తదితరులు మునిమడుగు వెంకటరాముడు ఆధ్వర్యంలో చేరారు. అలాగే రాగిమేకలపల్లికి చెందిన మారుతిరెడ్డి, చాకలి ఆంజనేయులు, గుట్టూరుకు చెందిన వడ్డె అశోక్‌, వడ్డె నాగరాజు, వడ్డె అనీల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

పెనుకొండ టౌన: మండలంలోని వడ్డిపల్లి పంచాయతీ, రెడ్డిచెరువుకట్ట, కంబాలపల్లి, పెద్దకోడిపల్లి, పాతర్లపల్లి, బూచెర్లె, కొత్తూరు నుంచి సుమారు 50 కుటుంబాలు శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరా రు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం సవిత వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - Apr 20 , 2024 | 12:24 AM