Share News

ఊసరవెళ్లి రాజకీయం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:31 PM

వైసీపీ ఊసరవెళ్లి రాజకీయానికి ఇదో నిదర్శనం. 2017లో ఎంవీఎస్‌ స్కీంకు అప్పటి ఎమ్మెల్యే బీవీ శంకుస్థాపన చేయగా 2019 వైసీపీ ప్రభుత్వం నిధులను నిలిపేసింది.

    ఊసరవెళ్లి రాజకీయం
2024 మార్చి 13న గాజులదిన్నె ప్రాజెక్టు దగ్గర మళ్లీ భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టారేణుక

2017లో ఎంవీఎస్‌ స్కీంకు అప్పటి ఎమ్మెల్యే బీవీ శంకుస్థాపన

2019 తరువాత నిధులను నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం

ఎన్నికల వేళ మళ్లీ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

గోనెగండ్ల, ఏప్రిల్‌30: వైసీపీ ఊసరవెళ్లి రాజకీయానికి ఇదో నిదర్శనం. 2017లో ఎంవీఎస్‌ స్కీంకు అప్పటి ఎమ్మెల్యే బీవీ శంకుస్థాపన చేయగా 2019 వైసీపీ ప్రభుత్వం నిధులను నిలిపేసింది. ఓట్ల కోసమని మార్చి 13న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్వర్థి బుట్టారేణుక హడావుడిగా భూమి పూజ చేపట్టారు. ఎవరిని మభ్యపెంటేందుకు ఈ భూమి పూజ పనులు చేపడుతున్నారో ప్రజలకు అంతుచిక్కడం లేదు. మండల పరిఽధిలోని 11 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మల్టీవిలేజస్‌ స్కీం కింద 13.50 కోట్లు విడుదల చేసింది. ఈ పనులను అప్పటి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 2017 ఏప్రిల్‌లో భూమి పూజ చేశారు. 2017 డిసెంబరు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద హెచ కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, పెద్దనేలటూరు, ఎర్రబాడు, కులుమాల గ్రామాల్లో ఓహెచ ఆర్‌ ట్యాంక్‌లు నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో ఈ పథకానికి సంబంధించిన పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రుపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో హుటాహుటిన ఎంవీఎస్‌ స్కీంకు రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించామని, 11 గ్రామాలకు అదనంగా మరో 3 గ్రామాలను చేర్చి 14 గ్రామాలకు నీరు అందించేందుకు గాను టెండర్‌ వర్క్‌పూర్తి అయిందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ ్యర్థి బుట్టా రేణుక మళ్లీ భూమి పూజ చేశారు.

ఎన్నిసార్లు భూమి పూజ చేస్తారు: రామకృష్ణ, తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, గాజులదిన్నె

ఎంవీఎస్‌స్కీం పనులకు గాను 2017లో అప్పటి టీడీపీ ఎమ్యెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. చాలా వరకు పనులు పూర్తి అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో నిలిచిపోయాయి. ఎన్నికలు వచ్చినందున వైసీపీ నాయకులు తాము ఏదో చేశామని చెప్పేందుకు మళ్లీ భూమి పూజ చేశారు. వైసీపీ నాయకులు ఎవరిని మోసం చేసేందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు.

Updated Date - Apr 30 , 2024 | 11:34 PM