Share News

3200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:40 AM

ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, నాటుసారాపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో(సెబ్‌) పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిఘా ముమ్మరం చేసి అనుమానం ఉన్న ప్రతి చోటా సోదాలు చేస్తున్నారు.

3200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

70లీటర్ల సారా స్వాధీనం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, నాటుసారాపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో(సెబ్‌) పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిఘా ముమ్మరం చేసి అనుమానం ఉన్న ప్రతి చోటా సోదాలు చేస్తున్నారు. ఈక్రమంలో శనివారం రాజమహేంద్రవరం రూరల్‌లో ని వెంకటనగరం గ్రావ.ు పరిధిలో గోదావరి లంకల్లో ఉన్న తూర్పు లంక, నడిమిలంకల్లో నార్త్‌ సెబ్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ డా.ఎన్‌.నిక్సన్‌ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. పొదల్లో పెద్ద ఎత్తున దాచిన పులియబెట్టి, బెల్లం ఊట, నాటుసారాను గుర్తించారు. 3200లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 70లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని నిక్సన్‌ తెలిపారు. బాధ్యుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ అక్రమ మద్యం, నాటుసారాపై గట్టి నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు.వారి వివరాలను అవసరమైతే గోప్యంగా ఉంచుతామన్నారు. సోదాల్లో మంగళగిరి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది కూడా పాల్గొన్నా

Updated Date - Apr 28 , 2024 | 01:40 AM