Share News

అమలుకు నోచుకోని హామీలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:52 AM

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సభలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక గాలి మాటలుగానే మిగిలిపోయాయి. నిడదవోలు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలతో నిడదవోలు అభివృద్ధి పథంలోకి దూసుకు పోతుందని భావించారు. కాని హామీలు అమలుకు కాకపోవడం వైసీపీ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచిందంటూ ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

అమలుకు నోచుకోని హామీలు
సీఎం జగన్‌ హామీ ఇచ్చినా అభివృద్ది చెందని నిడదవోలు ఆర్టీసీ డిపో

  • ఆర్టీసీ డిపో అభివృద్ధికి మంజూరు కాని నిధులు

  • విజ్జేశ్వరం-సిద్ధాంతం ఏటిగట్టు పనులేమయ్యాయి?

  • అడుగు ముందుకు పడని ప్రభుత్వాసుపత్రి పనులు

నిడదవోలు, ఏప్రిల్‌ 27: సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సభలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక గాలి మాటలుగానే మిగిలిపోయాయి. నిడదవోలు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలతో నిడదవోలు అభివృద్ధి పథంలోకి దూసుకు పోతుందని భావించారు. కాని హామీలు అమలుకు కాకపోవడం వైసీపీ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచిందంటూ ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలులోని ఆర్టీసీ డిపో అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు అభివృద్ధి సంగతి దేవుడెరుగు కొత్తగా ఒక బస్సు కూడా మంజూరు కాలేదు. ఉన్న బస్సుల్లోనే కొన్ని రూట్లను రద్దు చేసి ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచింది. బలహీన వర్గాల వారు రాకపోకలు సాగించే ఆర్టీసీ అభివృద్ధికి నిధులు ఎక్కడంటూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అలాగే నిడదవోలు మండలం విజ్జేశ్వరం నుంచి పెరవలి మండలం సిద్ధాంతం వరకు ఏటిగట్టు అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం జగన్‌ మాటలు ఉత్తుత్తి హామీగానే మిగిలిపోయింది. మరో పక్క 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు హడావిడిగా ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తూ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. శిలాఫలకమే మిగిలింది తప్ప నేటికి అడుగు పనులు కూడా ప్రారంభం కాలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప చిత్తశుద్ధితో అభివృద్ధి చేసేందుకు కాదని అన్ని గాలిమాటలే అంటూ ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:52 AM