Share News

ఎన్నికల ఖర్చులపై పూర్తిస్థాయి నిఘా

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:08 AM

జిల్లాలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులపై పూర్తిస్థాయిలో నిఘా ఉందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె ఎన్నిలక ఖర్చుల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల ఖర్చులపై పూర్తిస్థాయి నిఘా
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 19: జిల్లాలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులపై పూర్తిస్థాయిలో నిఘా ఉందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె ఎన్నిలక ఖర్చుల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల ఖర్చుల పరిశీలకులు రోహిత్‌ నగర్‌, నితిన్‌ కురాయిన్‌, జై అరింద్‌, రాజమహేంద్రవరం ఆర్‌వో కె.దినేష్‌కుమార్‌, రూరల్‌ ఆర్‌వో ఎన్‌.తేజ్‌భరత్‌లు హాజరయ్యారు. ఎన్నికల ఖర్చులపై క్షేత్రసాయి పరిశీలనలు, రికార్డుల నిర్వహణ, నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా చేపడుతున్న కార్యకలాపాలపై సమీక్షలు, ఎన్నికల కమిషన్‌ నియమావళి, మార్గదర్శకాలు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఇకపై చేసే ఖర్చులు నామినేషన్‌ దాఖ చేసిన అభ్యర్థుల ఖాతా కింద నమోదు అవుతాయని చెప్పారు. అలాగే ఎన్నికల ఖర్చుల విభాగం కలెక్టరేట్‌, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆర్‌వో కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కార్యాయంలో కూడా ఇదే సమావేశాన్ని ఆర్‌వో, మునిసిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ నిర్వహించారు.

Updated Date - Apr 20 , 2024 | 01:08 AM