Share News

కీలక దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకుంది

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:27 AM

సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.బాలసుభ్రమణ్యం ఆదేశించారు.

కీలక దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకుంది

అప్రమత్తంగా ఉండండి

పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 27: సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.బాలసుభ్రమణ్యం ఆదేశించారు. జిల్లా ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల అధికారిణి డాక్టర్‌ కే.మాధవీలత ఆధ్వర్యంలో ఎన్నిల అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌స్టేషన్లు వాటి పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో 21 మోడల్‌, రెండు యూత్‌, ఏడు మహిళా, రెండు దివ్యాంగ ఓటర్లు కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 23 ఎంసీసీ బృందాలు నియమించామని, ఎంిసీసీ ఉల్లంఘన కింద ప్రభుత్వ ఆస్తులపై 41వేలు, ప్రైవేట్‌ ఆస్తులపై 4836 సంబంధించి తొలగించినట్లు తెలిపారు. సి విజిల్‌ యాప్‌ 600 కాల్స్‌ వచ్చాయని 457 పరిష్కారం చేశామని, కేవలం 128 సమాచార సంబంధమైనవని తెలిపారు. సువిధా ద్వారా 968 అనుమతులు పెట్టుకోగా 820 జారీ చేయగా 116 తిరస్కరించామని 32 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటర్లు పెద్దఎత్తున పొలింగ్‌ కేంద్రాలకి వచ్చేలా స్వీప్‌ కార్యక్రమం చూడాలన్నారు. పోలింగ్‌ రోజున ఆరుగంటలకు లైన్‌లో నిలబడిన వారి వ్యక్తి స్లిప్‌ ఇచ్చి వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున పోటీలో ఉన్న అభ్యర్థులతో ఈనెల 30న సమావేశం నిర్వహించాలన్నారు. అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్‌కాంత్‌ సరోచ్‌, బలరామ్‌ మీనా లు మాట్లాడారు. నిఘా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. 24/7 సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేయాలన్నారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద వీడియోగ్రాఫి నిర్వహించాలన్నారు. వ్యయ పరిశీలకులు రోహిత్‌ నగర్‌, జై అవింద్‌, నితిన్‌ కురియన్‌లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ బృందానికి అందించాలన్నారు.

న తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 01:27 AM