Share News

పోలవరానికి ఏడు కోట్లతో సరిపెట్టారు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:32 AM

కేంద్రప్రభుత్వం సుమారు రూ.13వేల కోట్లు విడుదల చేస్తుందని పోలవరం నిర్వాసితులు ఎదురుచూసారని, అయితే కేవలం రూ.7 కోట్లు మాత్రమే విడుదలచేసి చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారులు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరానికి ఏడు కోట్లతో సరిపెట్టారు

ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారుడు అయినాపురపు

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 27: కేంద్రప్రభుత్వం సుమారు రూ.13వేల కోట్లు విడుదల చేస్తుందని పోలవరం నిర్వాసితులు ఎదురుచూసారని, అయితే కేవలం రూ.7 కోట్లు మాత్రమే విడుదలచేసి చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారులు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుతో ప్రతిబిల్లు పాస్‌ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ కేంద్రం ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి అదనంగా రూ.3లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని ,అఽధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నిర్వాసిత కుటుంభానికి రూ.10లక్షలు చొప్పున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఈ మేరకు 10లక్షల రూపాయల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉండగా తక్కువ నష్టపరిహారం పొందిన రైతులకు ఎకరానికి రూ.5లక్షలు బఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. భూమిలేని ఎస్సిఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్కరికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతున్నప్పటికి ప్రభుత్వం ఈమేరకు చర్యలు తీసుకోలేదన్నారు. ,మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కులస్తులకు ఢి పారం పట్టా భూములు ఇళ్ల స్థలాలకు సేకరించి వారిని భూమిలేని పేదలుగా మార్చారన్నారు. జిల్లా కలెక్టర్‌, భూసేకరణ అధికారులు కొత్త భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడ్డారన్నారు. పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో గ్రామ సభలు జరపాలని కానీ ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. దీనిపై హైకోర్టులో ఫిటిషన్‌ దాఖలు చేశామన్నారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి మహాసభ ప్రతినిధులు అగంటి వీరభద్రారెడ్డి, కెచ్చెల అబ్బాయి రెడ్డి, యలగాడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్‌, పలివెల పోశమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:32 AM