Share News

ఎన్నికల్లో వైసీపీ అంతం.. మాలల పంతం..

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:59 AM

రాష్ట్రంలో ఎస్సీలను విస్మరించి 27ఎస్సీ పథకాలను రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం అంతమే లక్ష్యంగా మాలలంతా పనిచేయాలని మాలలు నిర్ణయించారు.

ఎన్నికల్లో వైసీపీ అంతం.. మాలల పంతం..

మండపేట, ఏప్రిల్‌ 19: రాష్ట్రంలో ఎస్సీలను విస్మరించి 27ఎస్సీ పథకాలను రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం అంతమే లక్ష్యంగా మాలలంతా పనిచేయాలని మాలలు నిర్ణయించారు. స్థానిక సూర్యకన్వెన్షన్‌ హాల్‌లో మండపేట నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశం శుక్రవారం కూటమి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న నేతలు వైసీపీ మాలలకు చేసిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. విద్యా, ఉద్యోగాల్లో మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీకి చెందిన ఎస్సీ నేత ఇసు కపట్ల రఘుబాబు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా టీడీపీ నేత మహాసేన రాజేష్‌ మాట్లాడూతూ సీఎం జగన్‌ దళితు లకు మేనమామనంటూ చెప్పి దళితులను మోసం చేసి, దళిత పథకాలను రద్దుచేసిన ఘనుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆరోపిం చారు. ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి మాలలంతా చరమగీతం పాడతారన్నారు. కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు విజయం కోసం మాలలంతా పనిచేయా లని, తాను కూడా వేగుళ్ల విజయం కోసం పనిచేస్తానన్నారు. శిరో ముండ నం కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తులుకు ఓట్లు వేయ వద్దని దళిత నేతలు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను హత్యచేసిన ఘటనను, శిరోముండనం కేసులో నిందితుడుగా ఉన్న తోట త్రిమూర్తులుకు వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి దళితులను అవమానించిన విషయం దళితులు మరిచిపోలేదని నేతలుఅన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తామని నేతలు చెప్పారు. వేగుళ్లను 50వేలు ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని నేతలు ప్రకటించారు. మాలమహానాడు నేతలు వెంటపల్లి జాన్‌మార్క్‌, కప్పల సుధీర్‌కుమార్‌, మాదే ప్రసాద రావు, పిట్టా రాజబాబు, మలకా అప్పారావు, మాలలు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:59 AM