Share News

ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:56 PM

ఎన్నికల విధుల్లో నిష్పక్ష పాతంగా, అప్రమత్తంగా వ్యవహరిం చాలని పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమి తులైన కర్ణాటక ఐఏఎస్‌ అధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బం దికి సూచించారు.

ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించండి
కలికిరిలో ఎన్నికల అధికారులకు సూచనలిస్తున్న పరిశీలకురాలు కవిత ఎస్‌ మన్నికేరి

ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కవిత ఎస్‌ మన్నికేరి

పీలేరు/కలికిరి ఏప్రిల్‌ 27: ఎన్నికల విధుల్లో నిష్పక్ష పాతంగా, అప్రమత్తంగా వ్యవహరిం చాలని పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమి తులైన కర్ణాటక ఐఏఎస్‌ అధికారిణి కవిత ఎస్‌.మన్నికేరి బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బం దికి సూచించారు. పీలేరు నియోజకవర్గం కోసం పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన సా్ట్రంగు రూము, పీలేరు తహసీల్దా రు కార్యాలయా న్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతూ పో లింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు ఉండేటట్లు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అంతకు మునుపు ఆమె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సా్ట్రంగు రూమును పరిశీలించారు. పోలింగ్‌ ముందు రోజు ఎన్నికల సామగ్రి పంపిణీ సజావుగా, సకాలం లో ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఆర్‌వో మహ బూబ్‌ బాషా, ఏఎస్‌వో రామ్మోహన, డీటీ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ చాణక్య పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల గుర్తులేవీ పోలింగ్‌ కేంద్రాల్లో కబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకురాలు కవిత మన్నికేరి స్పష్టం చేశారు. కలికిరి రెవెన్యూ కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల గుర్తులతో పోలికలుండే ఎలాంటి చిహ్నాలు వుండరాదన్నారు. సమావేశం లో లైజనింగ్‌ అధికారి సయ్యద్‌ అహ్మద్‌, తహసీల్దారు విజయకుమారి, ఇనస్పెక్టర్‌ మోహన, ఎంపీడీవో రామకృష్ణ, సెక్టోరియల్‌ అధికారులు, బీఎల్‌ఓలు, వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:56 PM